మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ పేర్కొంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చి ఫిర్యాదులు.. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నరసాపురం నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుబ్బారాయుడు చేసిన వ్యాఖ్యలతో ఆయన్ను వైసీపీ సస్పెండ్ చేసింది.