కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు.
మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు సభకు టీడీపీ మహానాడు కంటే ఎక్కువగా ప్రజలు వచ్చారన్నారు.