టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సచివాలయంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి కడియం శ్రీవారి, టీఆర్ఎస్ నేతలు గాయత్రి రవికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేవరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయడం లేదన్నారు.