తనను హత్య చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కుట్ర పన్నారని.. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దాడికి యత్నించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. మేడ్చల్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తనను ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రేవంత్రెడ్డి నేరాలపై విచారణ జరిపి జైల్లో పెడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పథకాలు రెడ్లకు అందుతున్నాయని తాను చెప్పానన్నారు.