వందలు, వేల రూపాయిలు కాదు.. ఏకంగా రూ.కోట్లలో నగదు అకౌంట్లలో జమ అయింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అకౌంట్లలో ఎవరో వేస్తే అలా రూ.కోట్లలో నగదు జమకాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో జరిగింది. ఈ ఘటన తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ పలువురికి ఈ అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అంతేసి అమౌంట్ పడటంతో ఖాతాదారులు షాక్‌కి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చెందిన ఓ బ్రాంచ్‌లో వంద మంది అకౌంట్లలో రూ.13 కోట్ల చొప్పున డబ్బులు పడ్డాయి. దీనిపై ఖాతాదారులు బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పొరపాటున పడ్డాయని.. ఆ అకౌంట్లను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల ఇదే తరహా ఘటనలు జరిగాయి. వికారాబాద్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ఓ వ్యాపారికి రూ.18కోట్లకు పైగా జమ అయ్యాయి. మంథనిలో ఓ వ్యక్తికి రూ.13కోట్లు పడ్డాయి. పొరపాటు అలా పడ్డాయని భావించి బ్యాంక్ అధికారులు.. ఆయా అకౌంట్ల ట్రాన్సాక్షన్‌ను నిలిపివేశారు.