పైకి నలబై ఏండ్లు వచ్చిన పట్టుమని పదహారేండ్ల పాప లెక్క ఉంటది. సినీ ప్రపంచానికి పరిచయమై దశాబ్దం దాటుతున్నా కానీ చాలా ఫిట్‌గా, నాజూగ్గా కనిపిస్తూ నవతరం తారలకు పోటీనిస్తున్న బాలీవుడ్ భామ .. అందాల రాక్షసి ఈషా గుప్తా. తన ఫిట్‌నెస్ రహస్యమేమిటో ఆమె మాటల్లో మీకోసం..వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను. ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతా. దాదాపుగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోను.
ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంచితే మంచిదని నా అభిప్రాయం. లంచ్, డిన్నర్ మాత్రమే చేస్తా. నాకు బాగా ఇష్టమైన ఫుడ్ రాజ్మా చావల్, ఆలూ పరాటా. ఇదివరకు రస్‌మలై ఇష్టంగా తినేదాన్ని. వేగన్‌గా మారాక పూర్తిగా మానేశాను. నార్త్ ఇండియా స్పెషల్స్ బాగా వండగలను.
చక్కెర, గ్లూటెన్ నా డైట్‌లో అస్సలు కనపడని పదార్థాలు. అమ్మచేతి వంట చాలా ఇష్టం. పప్పన్నం, హల్వా, కార్నడో సబ్జీ ఇష్టంగా తింటా. కాలాన్నిబట్టి కొబ్బరినీళ్లు, మామిడి పన్నా, జింజర్ టీ తీసుకుంటా. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి మ్యాగీ ఇష్టపడతా. ఏం తిన్నా రోజూ వ్యాయామం తప్పనిసరి. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతా అని అంటుంది.