Home / SLIDER / మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది

మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రుతు ప్రేమ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. ఈ మేరకు ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంతో పాటు స్వచ్ఛ సిద్ధిపేట జిల్లాకు పాటు పడదామని దిశానిర్దేశం చేశారు.మీ నిశ్శబ్దం వీడండి. బహిరంగంగా చర్చించండి. రుతుప్రేమ ప్రయోజనాలు వివరించండి. రుతుప్రేమ లేకపోతే.. జీవనమే లేదు. మానవ మనుగడను శాసించేది రుతుచక్రం. మీ ఆరోగ్యం కాపాడాలి. మీ డబ్బు కాపాడాలి. మీ ఆరోగ్యమే.. మా ఆరోగ్యం. మీకు ఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, శాస్త్రీయమైన రుతుచక్రం పై మీకు అవగాహన కల్పించేందుకు ఈ రుతుప్రేమ కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.

సిద్ధిపేట జిల్లాలో ఇప్పటికే 3 వేల మందికి రుతుప్రేమ మెన్స్ట్రు వల్ కప్పులు అందించినట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా పంచాయతీ కార్యదర్శిలు, ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు అలాగే మహిళా గ్రామ సర్పంచ్ లు, ఏంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లుగా.. మీరంతా టీమ్ లీడర్లు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. మీరు పట్టుబడితే.. కానిదేమీ లేదు. రుతుప్రేమ విజయవంతం చేసేందుకు మీరంతా నడుం బిగించాలని మంత్రి పిలుపునిచ్చారు.

మొదట మీరు ఉపయోగిస్తే.. మీరే మోటీవేటర్లుగా.. అందరిలో స్ఫూర్తిని నింపిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ కస్తూర్భా, రెసిడెన్షియల్ పాఠశాలలలోని మహిళా విద్యార్థినీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటుగా మీ ఆరోగ్య రక్షణ చేయాలన్నదే మా ధ్యేయమని మంత్రి చెప్పారు.మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా, అలాగే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని.. అప్పుడే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat