తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని.. ఆ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విధించిన గడువులోపు ఆ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని.. అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా ఫినిషింగ్ వర్క్ ఉండాలని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.