కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారని అన్నారు.
సినీ నట సార్వభౌముడిగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్న గొప్ప నటుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు జయరామ్, తంగ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్లు బొబ్బ రంగారావు, రజిత రత్నం, కిషన్ రావు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు శంకరయ్య, బొడ్డు రవిశంకర్, సాగర్ రావు, సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్, నాగిళ్ళ శ్రీనివాస్, పరుచూరి దిలీప్ చౌదరి, సుంకవల్లి వీరబాబు, పరుచూరి శివరామ్ ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తులసి మరియు సూరారం, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.