బడుగు, బలహీనవర్గాల పక్షపాతి సీఎం జగన్ అని.. వారికి ఆయన సామాజిక న్యాయం చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అంబటి మాట్లాడారు.
బస్సు యాత్రకు ప్రతి చోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదని.. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు.టీడీపీ ఒంగోలులో నిర్వహిస్తున్నది మహానాడు కాదని.. ఏడుపునాడు అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీ వ్యతిరేకమని చెప్పారు.