Home / SLIDER / మెదక్ లో 17 కోట్ల రూపాయలతో మాతా శిశు అరోగ్య కేంద్రం

మెదక్ లో 17 కోట్ల రూపాయలతో మాతా శిశు అరోగ్య కేంద్రం

మెదక్ లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు అరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “100 పడకలప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఆసుపత్రి మొత్తం కాన్పుల కోసమే. చిన్నారుల కోసం మంచి వైద్యం అందుతుంది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో చొరవ చూపారు. సీఎం గారు మంజూరు చేశారు.

ఇందులో మెటర్నిటీ వార్డ్, లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్, పేడియాత్రిక్ వార్డ్, PICU, SNCU, ఆంటి నాటల్ వార్డ్, పోస్ట్ నాటల్ వార్డ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతం పెరగాలి. ముఖ్యమంత్రి గారు మంచి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుండి 56 శాతం పెరిగాయి. ఆశాలు బాధ్యత తీసుకోవాలి. మరింత పెంచాలి.రాష్ట్రంలో 27వేల మంది ఆశాల పరిధిలో 700 మంది పరిధిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నారు. మేము వీరితో సమీక్ష నిర్వహించాము.సాధారణ డెలివరీ పెరగాలి. దాని వల్ల తల్లి కి పిల్లకు లాభం. పుట్టిన బిడ్డకు ముర్రు పాలు మొదటి గంటలో అందాలి. 36 శాతం చిన్నారులకు మాత్రమే అందుతున్నది.

మొదటి ఏ ఎన్ సి చెకప్ నుండి దృష్టి సారించాలి. సాధారణ కాన్పు కోసం కౌన్సిలింగ్ ఇవ్వాలి. రాబోయే రోజుల్లో సాధారణ ప్రసవాలకు వైద్య సిబ్బందికి ఇన్సెంటివ్ రు. 3000 ఇస్తాము.ఆశాల పరిధిలో కేసులు ఎక్కువైతే చర్యలు ఉంటాయి. మంచి చేస్తే హైదరాబాద్ పిలిచి సన్మానం చేసినం .కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తున్నది.కరోనా సమయంలో ఎంతో కష్ట పడ్డారు. ఎంతో చేశారు. కానీ ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే అందరూ పని చేయనట్టు అవుతున్నది. అందుకే ఆ ఒక్కరూ మారండి లేకుంటే చర్యలు ఉంటాయి.ప్రతి నెల మూడో తారీఖున ఆశలతో టెలి కాన్ఫరెన్స్ ఉంటుంది అందరూ సిద్ధంగా ఉండండి.సలహాలు సూచనలు ఇవ్వండి. అమ్మఒడి వాహనం సేవలు అందించాలి. ఎవరు పని చేయకున్నా వారిపై చర్యలు తప్పవు. త్వరలో మెదక్ వస్తా మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకుందాము.దళిత బంధు ఒక ఉద్యమం. దళితులను నిలబెట్టేందుకు ఇదొక పెద్ద కార్యక్రమం. మెదక్ లో వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat