డా.బీఆర్.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని.. అది కూడా పవన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని కొడాలి నాని అన్నారు.