తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది.
ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే అప్పట్లో ఫిల్మ్ నగర్లో వార్తలొచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తున్నది. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు..అందులో ఓ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.