ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
మే 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.