మానేరు తీరంలో ప్యారాచూట్ విన్యాసాలుఅందుబాటులోకిరానున్నాయి. మూడు రోజులుగా కరీంనగర్ మానేరుజలాశయం మీదా ప్రయోగాత్మకంగా ఏయిర్ షో నిర్వహించారు. ప్యారాచూట్ విన్యాసాలకు ఈప్రాంతం అనువుగా ఉందా… లేదా అని పరిశీలించిన పైలెట్ సుకుమార్స్ సంతృప్తి వ్యక్తం చేశారు.
మానేరు అందాలతో పాటు తీగలవంతెన, కరీంనగర్ పరిసరాలు ఆకాశం నుంచి తిలకించే విధంగా ఏయిర్ షోలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారితో చర్చించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగర సమీపంలోనే జలాశయం ఉండటంతో నీటిపై సాహస క్రీడలతో పాటు గాలిలో విన్యాసాలు నిర్వహించాలన్న ప్రధాన లక్ష్యంతో వర్టికల్ వరల్డ్ ఏరో స్పోర్ట్స్ అండ్
అడ్వెంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సాహస క్రీడను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.