తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదంతో ఘర్షణ జరిగింది.
జహీరాబాద్ లోక్‌సభ ఇన్ఛార్జ్ మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గల నేతలు ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ఇలాంటి వర్గ విభేధాలతో మరింత దిగజారుతోంది.