సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది.
అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు తిరగడంతో అబ్బాయి కింద పడ్డాడు. దీంతో తలకు ఉన్న విగ్గు ఊడిపోయింది.ఇది అక్కడున్న వారంతా చూసి అవాక్కయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న పెండ్లి కూతురు బట్టతల ఉన్న వ్యక్తితో పెండ్లి వద్దంటే వద్దని భీష్మించుకుంది. చివరికి పంచాయితీ పోలీసుల దగ్గరికి కూడా వెళ్లింది. అయినా కూడా పెండ్లికి ససేమిరా అన్నది. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరుపగా, పెండ్లి కోసం అమ్మాయి తండ్రి ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు తిరిగి ఇవ్వాలని తీర్మానం చేయడంతో అబ్బాయి తరఫు వారు అంగీకరించారు.