వరల్డ్ లెవల్లో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇండియన్ లైఫ్ సైన్సెస్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాతో ఏర్పడిన సంక్షోభ సమయంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు.
ఇప్పటికే హైదరాబాద్ సిటీ ఈ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటోందన్నారు. దీనిని మరింత బలోపేతం చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని.. అయితే ఈప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు లేదని చెప్పారు. భవిష్యత్తులో ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.