మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అంబటి మాట్లాడారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు. సుపరిపాలన అందిస్తున్న నాయకుడు జగన్ అని.. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ తమ గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు. టీడీపీకి లోకేశ్, రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యారని అంబటి రాంబాబు విమర్శించారు.