నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని కరోనా వణికించిన సంఘటన మరవకముందే మరో సరికొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 దేశాల్లో సుమారు 80 కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్రువీకరించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా స్టడీ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కొన్ని దేశాల్లోని జంతు జనాభాలో ఆ వైరస్‌ను ఎండమిక్‌గా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
దీని వల్ల స్థానికంగా ప్రజల్లో, టూరిస్టుల్లో ఆ వైరస్ సోకుతున్నట్లు చెప్పింది. మంకీపాక్స్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు ఆరోగ్య సంస్థ తెలిపింది. మరో 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.