తెలంగాణ రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్ మోతీలాల్‌ను నాగర్‌కర్నూల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అదేవిధంగా హోంశాఖలో పనిచేస్తున్న కే అనిల్ కుమార్‌ను మహబూబ్‌నగర్ ఆర్డీవోగా నియమించారు.
ఆందోళ్ ఆర్డీవోగా ఉన్న వీ విక్టర్‌ను హెచ్‌ఎండీఏలో డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక నిర్మల్ ఆర్డీవోగా పనిచేస్తున్న రమేష్ రాథోడ్‌ను ఆదిలాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్న జే రాజేశ్వర్‌ను రెవెన్యూ శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు