దేశ ప్రజలకు ఇది పెద్ద రిలీఫ్. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.10, డీజిల్‌పై సుమారు రూ.7 తగ్గనుంది.
ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్ ధరపైనా భారీగా తగ్గింపు ప్రకటించారు. దాదాపు రూ.200 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.