బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా వాళ్లకు అయిన అతిపెద్ద పండుగ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్ మీద తళుక్కున మెరుస్తారు.
ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు. కేన్స్ సినిమా అవార్డుల జ్యూరీలోనూ సభ్యురాలైన బాలీవుడ్ తార దీపికా పదుకొనె ధరించిన వజ్రాల నెక్లెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదినలుపు రంగు సూట్‌తరహా డ్రెస్‌మీద.. తాతమ్మల కాలంనాటి కంటెను తలపించేలా ఉందా నగ.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ దీన్ని రూపొందించింది. 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేశారు. నగకు ముందు భాగంలో రెండు పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు. వాటి కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగారు. ఈ నెక్లెస్ ఖరీదు సుమారు మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.