ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే యోగా చేసే ముందు మితంగా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.
కానీ ఖాళీ కడుపుతో యోగా చేస్తే శ్వాస సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు యోగా నిపుణులు.
ఈ రెండు పరస్పర విరుద్ధమైన సలహాలలో మన శరీరతత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.