బీబీ నగర్ ఎయిమ్స్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలుమార్లు సందర్శించినా ఇక్కడి సదుపాయాలపై కేంద్రాన్ని ఏనాడూ అడగలేదని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఎయిమ్స్ నిర్మాణానికి భూములు, భవనాలు ఇచ్చి అన్నిరకాలుగా సహకారం అందించిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలకు ఉపయోగం కలగడం లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు హరీశ్‌రావు పరిశీలించి అందుతున్న వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేవలం 20 మంది ఇన్‌పేషెంట్లు మాత్రమే ఉండటాన్ని ఆయన గమనించి అసహనం వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌లాంటి పెద్దాసుపత్రిలో ఇంత తక్కువ సంఖ్యలో రోగులు ఉండటం దారుణమని చెప్పారు. ఎయిమ్స్ అభివృద్ధికి కిషన్‌రెడ్డి కృషి చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.