బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది.
రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి నమోదైన కేసులో లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో వారిద్దరిపై సీబీఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నది. కాగా, రూ. 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు.