తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది.
దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది.
దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.