తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూశాడు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా బాధ పడుతున్న చౌదరి కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రైవేట్ హస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
ఈయన మృతి పట్లు పులువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బహుబాషా నటుడైన చౌదరి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించాడు. ఈయన వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించాడు.