తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. యునైటెడ్ కింగ్‌డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ), ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేటీఆర్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్నారు. రాష్ట్రంలో సమగ్రమైన, ప్రగతిశీల ఈవీ పాలసీని ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే పలు ఈవీ కంపెనీలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని కేటీఆర్ గుర్తు చేశారు.
Tags cmkcr it minister of telangana ktr london tour slider telanganacm telanganacmo telanganagovernament trsgovernament trswp