తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది.
సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. కేన్స్ చిత్రోత్సవాల్లో రెండో రోజున మన తారలు మెరిశారు.
కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే, మాధవన్, శేఖర్ కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు చిత్రోత్సవాల్లో సందడి చేశారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా ప్రచారాన్ని ఈ వేదిక మీద నిర్వహించారు. మంగళవారం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ప్రారంభమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది.