బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య హోయలు ఒలికించింది.
రెడ్‌కార్పెట్ సమయంలో ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఫ్లోరల్ టచప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బర్ నటి అందర్నీ ఆకట్టుకున్నది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వర్య కేక పుట్టించడం ఇది మొదటిసారి కాదు. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో ఐశ్వర్య కనిపించింది. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య కూడా కేన్స్ ఫెస్టివల్‌కు వెళ్లారు.