దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో బస్సు యాత్రను పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నామని చెప్పారు. శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. నాలుగురోజులపాటు ఈ యాత్ర సాగుతుందన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారికేం చేశామో వివరిస్తామని చెప్పారు.