దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా, 15,647 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కాగా, 24 గంటల్లో 33 మంది కరోనాకు బలవగా, 2549 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 1,91,65,00,770 వ్యాక్సిన్ డోసులను పంపిణీచేశామని, మంగళవారం ఒక్కరోజే 14,97,695 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.