ప్రముఖ పర్యావరణవేత్త,వృక్షమాత, ప్రకృతి పరిరక్షకులు, పద్మ శ్రీ తిమ్మక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క(110) ఇవాళ బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పల్లె, పట్టణ ప్రగతి సమీక్షా సమావేశానికి తిమ్మక్కను కేసీఆర్ స్వయంగా తీసుకెళ్లారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, అధికారులకు తిమ్మక్కను కేసీఆర్ పరిచయం చేశారు.