తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది.
