చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు.ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.
మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.బీజేపీ పార్టీకి చెందిన మల్లన్న దుర్బుద్ధితో,జర్నలిస్ట్ గా చెలామణి అవుతూ జర్నలిజం లో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని న్యాయవాది పేర్కొన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువుకు భంగం కలిగించేలా, అసత్యపూరిత ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న.సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి 10 కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు.7 రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడ అజయ్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.