ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువరత్న.. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్యబాబు హీరోగా ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని తీస్తున్న తాజా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసింది.
ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.బాలయ్య 107వ చిత్రంలో కూడా ఒక మాస్ ఐటెం సాంగ్ ఉండనుందట. ఇందులో బాలయ్య వేసే స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయట.
అయితే ఈ ఐటెం సాంగ్‌లో బాలయ్యకు జోడీగా ‘ఖిలాడీ’ బ్యూటీ డింపుల్ హయతి స్టెప్పులేయనుందని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్‌ను థమన్ సిద్ధం చేశాడని టాక్. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ హనీరోజ్ నటించనుందట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.