ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది.
ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.