కేవలం రూ.920 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు రూ.వందలకోట్ల బిజినెస్‌కు అధిపతి అయ్యారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గోవింద్ ఢోలాకియా. ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు. తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతమైన విలువే తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు.
ఒకప్పుడు తన వ్యాపారం ప్రారంభించేందుకు రూ.920 కోసం కష్టపడ్డానని చెప్పారు. ఆత్మకథతో తన పాతరోజులను ఢోలాకియా గుర్తు చేసుకున్నారు. 1970లో వజ్రాలు మెరుగు పెట్టే సొంత వ్యాపారానికి రూ.920 అవసరమయ్యాయని.. కానీ తన వద్ద రూ.500 మాత్రమే ఉండేవని చెప్పారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్లు రూ.200 ఇచ్చారని.. పక్కింటి నుంచి మిగతా డబ్బులను సర్దుబాటు చేశారని తెలిపారు.
పాలిష్ పెట్టిన వజ్రాలకు 10 శాతం ప్రాఫిట్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన పని వాళ్లకు నచ్చడంతో మరికొన్ని ఆర్డర్లు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం ఆనందంగా ఉందని ఢోలాకియా పేర్కొన్నారు.