ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్‌పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు.
ట్విట్టర్‌లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్‌పూర్ ప్రకటించారు. ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన టీమ్ సిద్ధం చేసుకునేందుకు వైదొలగాలని బెయ్క్‌పూర్‌ను పరాగ్ అగర్వాల్ కోరారు.
ట్విట్టర్ నుంచి వైదొలగడం తప్పదని తాను ఊహించానని బెయ్క్‌పూర్ ట్వీట్ చేశారు. పరాగ్ అగర్వాల్ తనను వైదొలగాలని ఆదేశించాడన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్‌డోర్సీకి ధన్యవాదాలు తెలిపారు. బ్రూస్ ఫాల్క్ ఐదేండ్లుగా ట్విట్టర్‌లో పని చేస్తున్నారు. ట్వీట్ ద్వారా తన నిష్క్రమణ సంగతి ప్రకటించారు.