కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మసూద్, ఉస్మాన్, సమీన, అశోక్, ప్రసాద్, నాగరాజ్, సబెర, తార దేవి, షేక్ జకీర్ పాల్గొన్నారు.