కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పాపయ్య యాదవ్ నగర్ కు చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ చందర్ రావు, రవి, నారాయణ యాదవ్, కే.ఎన్.రెడ్డి, ఈశ్వర్ రావు పాల్గొన్నారు.