త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు.
అంతేకాకుండా వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి గానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం. అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.