ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్ గా చెప్పడం తనను నివ్వెరపోయేలా చేసిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆయన ఈ సందర్భంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్ నైన ట్యాప్ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన వైసీపీ సర్కారును ప్రశ్నించారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు ప్రతిపక్షాలపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.