కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన సుభాష్ నగర్ ఆటో స్టాండ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లిటిల్ స్టార్ స్కూల్ నుండి సుభాష్ నగర్ లాస్ట్ బస్టాప్ వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్డు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు నాగిరెడ్డి, ప్రెసిడెంట్ రవి, వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, జనరల్ సెక్రెటరీ వెంకటేష్, జాయింట్ సెక్రటరీ లక్ష్మా రెడ్డి, ట్రెజరర్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, సుధాకర్ పాల్గొన్నారు.