అనేక మత గ్రంథాలలో ఉదయం సమయం చాలా విలువైనదిగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో చూడొద్దట. ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు. చూస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. జంతువుల చిత్రాలు, అంట్ల గిన్నెలను లేవగానే చూడొద్దు. అలా చూస్తే దాని వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుందని జ్యోతిష్యం చెబుతోంది.
