అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్‌తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది.
ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్‌చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు వచ్చే ప్రవాహం తగ్గిపోతుందని.. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. దిగువ రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని అనుమతులపై పరిశీలించాలని చెప్పారు.