తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలోని కరీమాబాద్ లో నివాసముంటున్న మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మ ల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. గత కొద్ది కాలంగా అక్కడే సెటిల్ అయ్యారు.
అయితే, 5 రోజుల క్రితం జెర్మనీ లోనే అఫీస్ పని పై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. దేశం కాని దేశం కావడంతో సమాచారం సరిగా లేదు. దీంతో కరీమా బాద్ లోని అఖిల్ అమ్మా, నాన్న లు ఆందోళనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. తను సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి తగు సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళను ఓదార్చారు.మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఆ కాలనీ వాసులు ఉన్నారు.