ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు.
చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. జనసేన ప్రకటనపై బీజేపీ స్పందన మాత్రం వేరేలా ఉందన్నారు. ఎలాంటి భావసారూప్యత లేని పార్టీలు ఎలా కలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఏదోవిధంగా జగన్‌ను గద్దె దింపి చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలని వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తున్నారన్నారు. జనసేన, టీడీపీ రెండూ ఒక్కటేనని.. చంద్రబాబు స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. పొత్తులపై అందరూ కలిసి ప్రజల్ని ఫూల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.