ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు.
ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని అన్నారు.